ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో గల జిల్లా విద్యా శిక్షణా సంస్థలు (డైట్)లోని ఖాళీ పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రభుత్వం, జిల్లా పరిషత్ మరియు మునిసిపల్ యాజమాన్య పాఠశాలల్లో సేవలందిస్తున్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి, త్రీ మెన్ కమిటీ ద్వారా డైట్లలో నియమించనుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్‌గా మరియు డైట్ ప్రిన్సిపాల్ సభ్యునిగా ఉంటారు.
ముఖ్యమైన తేదీలు మరియు వివరాలు:
దరఖాస్తు సమయం: 23-10-2025 నుండి 29-10-2025 వరకు.
దరఖాస్తు పద్ధతి: గూగుల్ ఫారం బదులుగా ఇప్పుడు లీప్ యాప్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తు చేసిన వారు కూడా తిరిగి లీప్ యాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
అప్లికేషన్ సమర్పణ: లీప్ యాప్ నుండి అప్లికేషన్ ఫారమ్ను డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, సంబంధిత అధికారి చేత కౌంటర్ సంతకం చేయించి, మీ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించవలెను.
దరఖాస్తు స్క్రటినీ: 30-10-2025 నుండి 31-10-2025 వరకు.
వ్రాత పరీక్ష: 05-11-2025 నుండి 08-11-2025 వరకు (మొత్తం 6 సెషన్లలో).
వ్రాత పరీక్ష ఫలితాలు: 13-11-2025న ప్రకటించబడతాయి.
ఇంటర్వ్యూ: 14-11-2025 నుండి 15-11-2025 వరకు త్రీ మెన్ కమిటీ ద్వారా నిర్వహించబడుతుంది.
తుది ఎంపిక: వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా చేసి, ఎంపికైన అభ్యర్థులకు ఆర్డర్లు జారీ చేయబడతాయి.
జాయినింగ్: 19-11-2025న సంబంధిత డైట్లో డిప్యుటేషన్ (అండర్ ఫారిన్ సర్వీస్) పై జాయిన్ చేయవలసి ఉంటుంది.
అర్హతలు:
31-10-2025 నాటికి వయస్సు 58 సంవత్సరాలు నిండకూడదు.
31-10-2025 నాటికి స్కూల్ అసిస్టెంట్‌గా కనీసం 5 సంవత్సరాల సేవ పూర్తి చేసి ఉండాలి.

